Aug 06,2023 00:16

సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబు

సత్తెనపల్లి రూరల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీల నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు అధికారులను ఆదేశించారు. సత్తెనపల్లి మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఎంపిపి షేక్‌ యలవర్తిపాటి జైబూన్‌ బి అద్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అయినందున వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో వుండాలని వారికి కావలసిన ఎరువులు పురుగుమందుల విత్తనాలు అందు బాటులో వవుంచాలని సూచించారు. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం వున్నందున వైద్యాధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎంపీపీ జై బూన్‌ బి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అధికారులు అమలు చేయా లన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ జీవి సత్యనారాయణ, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పెండెం బాబురావు, రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యులు కళ్ళం విజయభాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు