ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : జగనన్న గృహాలు మంజూరైన లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్ పేర్కొన్నారు. మండలంలోని మహిమలూరు సచివాలయంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ ఇజాక్ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారులు తమకు కేటాయించిన ప్లాట్లలో త్వరగా ఇళ్లులు కట్టడం ప్రారంభించాలని కోరారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన ఇళ్లు కాంట్రాక్టర్లు ద్వారా నిర్మించడానికి ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అనంతరం వేణుగోపాల స్వామి దేవాలయం లే అవుట్ సందర్శించి అక్కడ వివిధ స్థాయిలో కట్టియున్న గృహాలను పరిశీలించి వాళ్లకు తక్షణమే బిల్లులు ఏర్పాటు చేయమని ఎఇకి తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పి.చంద్రశేఖర్, హౌసింగ్ ఎఇ శరత్ ఎఫ్‌ఎసి, పంచాయతీ కార్యదర్శి పి.భాస్కరరావు, వలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.










