ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తున్న వైవి.సుబ్బారెడ్డి
ప్రజాశక్తి-విశాఖపట్నం: పెందుర్తి నియోజకవర్గం పరిధి పెదగంట్యాడ మండలం నడుపూరు వద్ద జగనన్న లే-అవుట్‌లో ఇళ్ల నిర్మాణాలను మంగళవారం ఉమ్మడి విశాఖ జిల్లా కో-ఆర్డినేటర్ వైవి.సుబ్బారెడ్డి ప్రారంభించారు. 160 ఎకరాలలో రూ.100 కోట్లతో 6216 ఇళ్లను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నపురెడ్డి అదీప్ రాజు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున పాల్గొన్నారు.










