ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా మంజూరైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఎంపిపి కేత వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చెర్లోఎడవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హౌసింగ్ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపిపి, ఎంపిడిఒలు మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్లు మంజూరైన లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. లేఅవుట్‌కు సంబంధించి ఎంపికైన 15 మంది లబ్ధిదారులు తమ సొంతంగా అయినా ఇల్లు నిర్మించుకోవచ్చని, సొంతంగా నిర్మించుకోలేని వాళ్లు తమకు అందుబాటులో ఉన్న కాంట్రాక్టర్ ద్వారా అయినా కట్టించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం 1.80 లక్షలు ఈ నిర్మాణాలకు అందజేస్తుందని తెలిపారు. పొదుపు గ్రూపు సభ్యులకు రూ.35 వేలు రుణాలు ప్రత్యేకంగా ఇళ్ల నిర్మాణాల కోసం ఇప్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎపిఎం వెంకమ్మ మాట్లాడుతూ బ్యాంకులకు సక్రమంగా తిరిగి చెల్లింపులు చేస్తున్న గ్రూపులకు తప్పనిసరిగా రూ.35వేల రుణాలు ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పనులు ప్రారంభించిన వారికి బిల్లులు ఎప్పటికప్పుడు మంజూరు చేయడం జరుగుతుందని శరత్ తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, హౌసింగ్ లబ్ధిదారులు, పొదుపు సిబ్బంది పాల్గొన్నారు.










