Aug 05,2022 23:14

లబ్ధిదారులతో మాట్లాడుతున్న జెసి, హౌసింగ్‌ డైరెక్టర్‌

ప్రజాశక్తి- ఆనందపురం        జగనన్న ఇళ్ల నిర్మాణంలో ఉదాసీనత తగదని, నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరితగతిని పూర్తి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌ లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం , గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్‌ ఎన్‌ భరత్‌గుప్తాతో కలిసిమండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ముచ్చర్ల గ్రామపంచాయతీ తంగుడు బిల్లి గ్రామం వద్ద 519 ఎకరాల విస్తీర్ణంలో అర్బన్‌ లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ సెంటు విస్తీర్ణం చొప్పున కేటాయించిన 17 వేల ఇళ్ల లేఅవుట్లు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిడిజాల, చందక, జగన్నాధపురం పంచాయతీలో ఇళ్లను పరిశీలించి, తర్వాత వెల్లంకి పంచాయతీ పాత కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు.కార్యక్రమంలో తహశీల్దార్‌ లోకవరపు రామారావు, హౌసింగ్‌ పీడీ పి.శ్రీనివాస్‌, హౌసింగ్‌ ఎఇ లోకనాథం, ఎంఆర్‌ఐ పి.మణికంఠ, వెల్లంకి సర్పంచ్‌ లక్ష్మణరావు పాల్గొన్నారు.