
ప్రజాశక్తి-కోటవురట్ల:మండలంలో చౌడువాడ గ్రామంలో శనివారం మండల ప్రత్యేక అధికారి జగనన్న కాలనీ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ, కాలనీ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు అవసరమైన ఐరన్, సిమెంటు, ఇసుక అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. నిర్మాణదారులకు ఇబ్బందులు కలగకుండా కల్పించాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు, స్థానిక సర్పంచ్ గోపాలకృష్ణ, హౌసింగ్ ఏఈ జగదీశ్వరరావు, పిఆర్‌ఏఈ వర్మ, ఏఈ కరుణ, ఏఓ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
గొలుగొండ:ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి బి.మోహన్‌రావు జగనన్న కాలనీ లబ్ధిదారులకు సూచించారు. మండలంలోని రావణాపల్లి గ్రామ పంచాయతీలో హౌసింగ్ కాలనీ, సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలను మొదలు పెట్టని లబ్ధిదారులంతా త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఒపిఆర్‌డి రఘురాం, పంచాయతీ కార్యదర్శి అప్పారావు పాల్గొన్నారు.