Aug 16,2023 20:47

రాజంపేట : పులపత్తూరులో లబ్ధిదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాజంపేట అర్బన్‌ : పులపుత్తూరులో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత కాంట్రాక్టర్‌, అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని పులపుత్తూరులో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల వేగవంతం కోసం క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులపుత్తూరులో ఇళ్ల నిర్మాణాల పూర్తిపై అధికారులు ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. ఇళ్లు నిర్మించుకున్న వారికి త్వరగా బిల్లులు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వీధివీధికి వాటర్‌ కనెక్షన్‌ ఇచ్చారా అని గ్రామస్తులును కలెక్టర్‌ ఆరా తీయగా పైపులో నీళ్లు లీకేజీ అవుతున్నాయని ఆయన దష్టికి తీసుకొచ్చారు. లీకేజీ లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తాత్కాలిక పనులు చేయకుండా శాశ్వతమైన పనులు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో స్లాబ్‌ వేసే సమయంలో ఇంజినీర్‌ అసిస్టెంట్‌ అక్కడే ఉండి నాలుగు వైపులా అర అడుగు స్లాబ్‌ వేసేలా చూడాలన్నారు. ఆర అడుగు వేయడానికి రూ.పది వేలు అదనంగా శాంక్షన్‌ చేశామన్నారు. కాంట్రాక్టర్‌, సంబంధిత అధికారులు సీరియస్‌గా తీసుకొని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం కోసం కాంట్రాక్టర్‌కు సహకరించాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో రాజంపేట ఆర్‌డిఒ రామకృష్ణారెడ్డి,గహ నిర్మాణ శాఖ పీడీ శివయ్య, తహశీల్దార్‌, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మంగంపేట లే అవుట్‌లో సదుపాయాలు
రైల్వేకోడూరు(ఓబులవారిపల్లి):మంగంపేట నిర్వాసితుల పునరావాస కల్పనలో భాగంగా లే అవుట్‌లో సకల సదుపాయాలు కల్పిస్తామని గిరీష తెలిపారు. మండలంలోని మంగంపేట నిర్వాసితుల పునరావాస కల్పనలో భాగంగా ఆర్‌ఆర్‌ 5 లే అవుట్‌లో మౌలిక వసతుల కల్పనపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంగంపేట నిర్వాసితుల పునరావాస కల్పనలో భాగంగా హరిజనవాడ ఆర్‌ఆర్‌ 5 లేఅవుట్‌ను విజేట్‌ చేసి గ్రామస్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. లేఅవుట్‌లో సిసి రోడ్డు, డ్రెయినేజీ, పార్కు, స్కూల్‌, తదితర సకల సదుపాయాలను కల్పిస్తామని చాలా మంచి లేఅవుట్‌ని గ్రామస్తులకు తెలియజేశారు.