అధికారులతో మాట్లాడుతున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
ప్రజాశక్తి - మంత్రాలయం
జగనన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. శనివారం తహశీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మండలంలోని జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్, రోడ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైసిపి మండల ఇన్‌ఛార్జీ, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి, సర్పంచి తెల్లబండ్ల భీమయ్య, గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. హౌసింగ్ పీడీ వెంకటరమణ, తహశీల్దార్ చంద్ర శేఖర్, ఎంపిడిఒ మణిమంజరి, హౌసింగ్ డిఇ లాలీ కృష్ణయ్య పాల్గొన్నారు.










