May 20,2023 19:50

గృహాలను పరిశీలిస్తున్న ఎంపిడిఒ బంగారమ్మ

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్‌
జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని తహశీల్దార్‌ బంగారమ్మ తెలిపారు. శనివారం మండలంలోని గుడికల్‌ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల పనితీరును పరిశీలించారు. ఇళ్లను త్వరగా పూర్తి చేసి ఇవ్వాలని సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లను, హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు. గ్రామంలో మొత్తం 108 మంది లబ్ధిదారులకు గాను 5గురు మాత్రమే స్లాబ్‌ లెవల్‌లో పూర్తి చేసుకున్నట్లు, 34 గృహాలు బేస్‌ లెవెల్‌లోనే ఆగిపోయినట్లు గుర్తించారు. ఇఒఆర్‌డి విజయలక్ష్మి, సర్పంచి నాగేష్‌ పాల్గొన్నారు.