ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్
ప్రజాశక్తి- పుంగనూరు
పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న గహనిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ పేర్కొన్నారు. మండలంలోని గూడూరుపల్లి వద్ద హౌసింగ్ లేఅవుట్ లో జరుగుతున్న ఇండ్ల నిర్మాణ పనులను, అర్బన్‌లో పూర్తి అయిన టిడ్కో గహాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇండ్లు మంజూరైన లబ్ధిదారులందరూ ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని గహప్రవేశాలకు సిద్ధం కావాలని తెలిపారు. పెండింగ్ ఉన్న పనులు హౌసింగ్ అధికారులు త్వరితగతిన పూర్తి చేసేలా ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ పద్మనాభం, పిఆర్‌ఎస్‌ఈ చంద్రశేఖర్ రెడ్డి, మెప్మా పిడి రాధమ్మ, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, తహసీల్దార్ సీతారాం, ఎంపీడీవో నారాయణ నాయక్, గహనిర్మాణ శాఖ అర్బన్, రూరల్ ఏఈలు పాల్గొన్నారు.










