Jun 21,2023 19:26

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిడిఒ రాధా

ప్రజాశక్తి - హోళగుంద
జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని, వేగవంతం చేయాలని ఎంపిడిఒ రాధా, హౌసింగ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఆదినారాయణ తెలిపారు. బుధవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో హౌసింగ్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జీరో ప్రాసెసర్‌ ఉన్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు షోకాజ్‌ నోటీసులు అందజేశామన్నారు. హౌసింగ్‌ నిర్మాణంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్‌ గత సమావేశంలో హెచ్చరించినట్లు గుర్తు చేశారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసేందుకు అడ్వాన్స్‌ కింద ఒక్కో లబ్ధిదారునికీ రూ.20 వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి లబ్ధిదారుడూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.