ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె మండలంలోని జగనన్న కాలనీలను ఇళ్ల లబ్ధిదారులు, సంబంధిత అధికారులతో కలిసి శనివారం రేపల్లె ఆర్డీవో ఇళ్ల కాలనీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో జగన్నాథం పార్థసారథి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. కాలనీలో ఇప్పటికే విద్యుత్, నీటి సరఫరా, రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులను లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బేస్‌మెంట్ స్థాయిలోనే ఎగుడు దిగుడు లేకుండా క్రమపద్ధతిలో సమాం తరంగా నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వాహకు లకు కమిషనర్ సూచించారు. రెండు పూటలా ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకూ వాటరింగ్ చేస్తూ ఉండాల న్నారు. లబ్ధిదారుల నుంచి ఫిర్యాదు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను, ఏజెన్సీల నిర్వాహ కులను ఆర్డీవో ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన బ్రిక్స్, ఐరన్, ఇసుక, సిమెంట్ కొరత లేకుండా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేందుకు అధికారులు సచివాల సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గృహ నిర్మాణాలపై సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని లబ్ధిదారులను ఆర్డీవో జగన్నాథం పార్థసారథి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి విజయసారథి సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.










