ప్రజాశక్తి - టి.నరసాపురం
గ్రామస్థాయిలో లేఅవుట్‌లలో గృహనిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎంపిడిఒ ఎన్.తిరుపతిస్వామి తెలిపారు. మండలంలోని బొర్రంపాలెం, తిరుమలదేవిపేట, ఏపిగుంట, కేతవరం గ్రామాల్లో జగనన్న గృహనిర్మాణ లబ్ధిదారులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. లబ్ధిదారులు వెంటనే గృహనిర్మాణ పనులు చేపట్టాలన్నారు. జగనన్న కాలనీల్లో తాగునీటి సౌకర్యం, సిమెంటు రోడ్లు, డ్రెయినేజీ వంటి మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించనున్నట్లు చెప్పారు.










