ప్రజాశక్తి- సబ్బవరం : సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ కమర్షియల్ లా ఆధ్వర్యాన జాబితాలో లేని కంపెనీలలో ఈక్విటీ లావాదేవీలు అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్‌ను శుక్రవారం వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్.సూర్య ప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాలలో ఆర్థికాభివృద్ధి అనేది కార్పొరేట్ చట్టాల అభివృద్ధికి, ఔచిత్యానికి దారితీసిందన్నారు. కార్పొరేట్ రంగంలో వృద్ధి, రోజురోజుకు దాని పరిధి విస్తృతమవుతోందని, కార్పొరేట్, సెక్యూరిటీల చట్టాలను అభ్యసించాలని సూచించారు. ముఖ్య వ్యక్తలుగా పాల్గొన్న అమర్‌చంద్ మంగళదాస్ సంస్థ భాగస్వాములు విశాక్ అబ్రహం, సౌరవ్ సమద్దర్ మాట్లాడుతూ ఈక్విటీ, అప్పు, లావాదేవీలలో పార్టీల హక్కులు, బాధ్యతలపై ప్రభావం, షేర్ల కొనుగోలు ఒప్పందాల కాన్సెప్ట్‌ల యొక్క ముఖ్య అంశాలు, కంపెనీపై దాని సమస్యలు, కంపెనీలు జారీ చేసిన సెక్యూరిటీల నియంత్రణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ మధుసూదన్ రావు, అకడమిక్ అఫైర్స్ అండ్ రీసెర్చ్ అండ్ ఫ్యాకల్టీ అడ్వైజర్, సీబీసీల డాక్టర్ దయానంద మూర్తి, సీబీసీల ఫాకల్టీ అడ్వైసర్ బయోలా కిరణ్ విద్యార్థుల పాల్గొన్నారు.










