Oct 20,2022 23:28

క్షేత్రస్థాయిలో ఈక్రాప్‌ నమోదును పరిశీలిస్తున్నకలెక్టర్‌

ప్రజాశక్తి- ఆనందపురం : మండలంలో బోని, సిర్లపాలెం గ్రామాలలో ఈక్రాప్‌ నమోదును జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున గురువారం ఆకస్మికంగా సందర్శించి తనికీ చేశారు. అధికారుల పనితీరుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా అందుతున్న సేవలపై రైతులతో చర్చించారు. కార్యక్రమంలో భీమిలి వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు బొడ్డేపల్లి విజయప్రసాద్‌, ఎఒ సంధ్య రత్నప్రభ, తహశీల్దార్‌ రామారావు, ఎంపిడిఒ లవరాజు, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ బోని అప్పలనాయుడు, బోని సర్పంచ్‌ బోని అప్పలకొండ, సన్యాసినాయుడు, సిర్లపాలెం సర్పంచ్‌ సిర్ల అప్పలనాయుడు, విఆర్‌ఒ రామారావు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ జి.దిలీప్‌చక్రవర్తి పాల్గొన్నారు.