Nov 03,2022 23:43

సమావేశం లో మాట్లాడుతున్న లీలావతి

జిల్లా వ్యవసాయాధికారి లీలావతి
ప్రజాశక్తి- కశింకోట
: రైతులంతా విధిగా ఇకెవైసి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి లీలావతి అన్నారు గురవారం మండలంలోని వెదురుపర్తి గ్రామ సచివాలయంలో ఈ-క్రాప్‌ సామాజిక ముసాయిదా జాబితాపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి లీలావతి మాట్లాడుతూ ఇ-క్రాప్‌లోని వివరాల ఆధారంగానే ధాన్యం కొనుగోలు, పంట నష్ట పరిహారం, పంటల బీమా అమలౌతాయన్నారు. ఈ-క్రాప్‌ నమోదులో ఏవైనా సవరణలు చేయాలనుకున్నా, ఒకవేళ ఎవరైనా రైతులు తప్పుగాతమ వివరాలను నమోదు చేసుకున్నా వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. పిఎం.కిసాన్‌, ఇకెవైసి చేసుకోలేని రైతులందరూ తప్పనిసరిగా ఇపుడు చేయించుకోవాలని సూచించారు. రబీ సీజన్‌కు విత్తనాల ఇండెంట్‌పై రైతులతో చర్చించారు
వ్యవసాయ సహాయ సంచాలకులు ఎమ్‌ రామారావు మాట్లాడుతూ ప్రస్తుతం వరి పంట పొలాల్లో తెగుళ్లు, పురుగుల ఉధృతి ఎక్కువగా ఉందని, రైతులు తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. వరిపైర్లలో సుడిదోమ నివారణకు పైమెట్రోజిన్‌ 120 గ్రాములు 200లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలని సూచించారు.. రైతు భరోసా మాస పత్రిక ప్రాముఖ్యత వివరించారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సింధూజ పాల్గొన్నారు