ప్రజాశక్తి - ద్వారకాతిరుమల
ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన శ్రీ పద్మావతి ఫలహారాలశాల కొండపై ప్రసాదాల కౌంటర్లు గురువారం ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారి నిర్వహణలో ప్రారంభించారు. ఇంతకు ముందు ప్రయివేట్ నిర్వహణలో ఉన్న ఈ క్యాంటీన్ అధిక ధరలతో భక్తులకు భారంగా ఉండేది. ప్రస్తుతం దేవస్థానం వారు ప్రారంభించడం వల్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ క్యాంటీన్ సరసమైన ధరల్లో దేవస్థానం వారు సుదీర్ఘ కాలం పాటు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు.










