Nov 03,2023 21:20

సబ్‌ స్టేషన్లను ప్రారంభించిన పివిఎల్‌ నరసింహరాజు
ప్రజాశక్తి - ఆకివీడు
ఇక విద్యుత్‌ కోతలు ఉండవని, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తామని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు తెలిపారు. మండలంలోని తాళ్లకోడులో 74 ఎకరాల జగనన్న కాలనీ కోసం ప్రత్యేకంగా రూ.6.30 కోట్లతో నిర్మించిన 220 కెవి సబ్‌ స్టేషన్‌ను పివిఎల్‌ నరసింహరాజు, జెడ్‌పిటిసి వేగేశ్న వెంకట్రాజుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం గుమ్మలూరు రోడ్డులో గాలిబ్‌ చెరువు వద్ద ఆకివీడు దిగువ ప్రాంతంతో కలిపి ఐదు గ్రామాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 33 కెవి సబ్‌ స్టేషన్‌ను పివిఎల్‌ ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమాలకు నగర పంచాయతీ ఛైర్‌ పర్సన్‌ జామి హైమావతి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి కఠారి రాజ్యలక్ష్మి, ఫాన్సీ చైర్మన్‌ రసూల్‌ బేబీ, అయిభీమవరం సర్పంచి గాలి సామ్రాజ్యం, నగర పంచాయతీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.