Jun 17,2023 00:04

వినుకొండ: రాష్ట్రంలో ఎంపి కుటుంబానికే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజ నేయులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్టణం లో అధికార పార్టీ ఎంపీ, భార్య కుమారుడుని 48 గంటలపాటు కిడ్నాప్‌ చేస్తే హోంశాఖ డిజిపి ఏమి చేస్తున్నారో సవ ధానం చెప్పాలన్నారు. ఒకప్పుడు విశాఖ నగరం ఫైనాన్స్‌ క్యాపిటల్‌ గా ఎదిగితే నేడు మాఫియాలో క్రైమ్‌ క్యాపిటల్‌ గా మార్చారని విమ ర్శించారు. సీఎం అసమర్ధ పాలనను తీవ్రంగా ఖం డిస్తున్నామని, రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.
పల్నాడు జిల్లాలో అధికార పార్టీ టిడిపి సాను భూతిపరుల ఓట్లు తొలగించి దొంగ ఓట్లను చేర్చు కునే కుట్ర చేస్తోందని జీవీ ఆంజనేయులు ఆరో పించారు. ఓటమి భయంతో అధికార పార్టీ ఎమ్మె ల్యేలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఓట్ల తొల గింపునకు చేస్తున్న ప్రయత్నం చట్ట విరుద్ధమని, అర్హుల ఓట్లను తొలగిస్తే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఏడువేల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కనుమల్లపూడిలో అర్హులైన 24 మంది ఓట్లు తొలగించారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల చేర్పులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు.వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు పొలిటికల్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడమే కాకుండా రియల్‌ టైం నుంచి డబ్బులు వసూలు చేస్తూ చీకటి వ్యాపారం చేస్తున్నారని ఆరో పించారు. పసుపులేరు బ్రిడ్జి వద్ద ప్రభుత్వ భూము లను బినామీలతో అన్యాక్రాంతం చేయించి దోచు కుంటోంది ఎమ్మెల్యేనే అని ఆరోపించారు.