ప్రజాశక్తి-కాకినాడ ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని కోరుతూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా అర్బన్ తహశీల్దారు కార్యాలయం నుంచి బాలాజీచెరువు సెంటర్ వరకూ శుక్రవారం కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ 1945లో 10 శాతం భూభాగం మాత్రమే కలిగిన ఇజ్రాయిల్ 2023 నాటికి 90 శాతం పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుందన్నారు. పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి హమాస్ దాడులు ఒక సాకు మాత్రమేనని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వ శేషబాబ్జి, చెక్కల రాజ్‌కుమార్, కోశాధికారి మలకా రమణ, పలు ప్రజా సంఘాల నాయకులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, భారతి, వేణి, నాగలక్ష్మి, చామంతి, తోకల ప్రసాద్, పప్పుల ఆదినారాయణ, జాన్ బాబు, కాటంరాజు, శేఖరు, వీరబాబు, జల్లూరి వేంకటేశ్వర్లు, దూసర్లపూడి రమణరాజు, జి.సత్యన్నారాయణ, నాగేశ్వరరావు, నరసరాజు, తాళ్లూరి రాజు, జి.సాయిబాబు, తాతపూడి రామకృష్ణ, రాజారావు, గోపిశెట్టి బూరయ్య, పరశురాం, గోవింద్ పాల్గొన్నారు.