
పాచిపెంట:పాలస్తీనాపై ఇజ్రాయిల్ అత్యంత పాశవికంగా దాడులు నిర్వహిస్తుందని, ఈ దాడుల్లో అనేక మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడుతున్నారని, తక్షణమే ఈ దాడులను నిలిపివేయాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యాన శనివారం స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్ ఆవరణలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఈశ్వరరావు, సిహెచ్ పోలిరాజు మాట్లాడుతూ పాలస్తీనా ప్రజలను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌కు మోడీ ప్రభుత్వం మద్దతు పలకడం దారుణమని అన్నారు. పాలస్తీనా భూభాగం ఆక్రమించుకోవడానికి ఇజ్రాయిల్ చేసిన దాడులను ప్రపంచ దేశాలన్నీ ఖండించగా, మోడీ ప్రభుత్వం అమెరికా అండతో ఇజ్రాయులకు మద్దతు ఇస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయాల ప్రకారం పాలస్తీనా భూభాగాల నుండి ఇజ్రాయిల్ పూర్తిగా వైదొలగాలని కోరారు. అమెరికా, బ్రిటన్ దేశాలు ఇజ్రాయిల్‌ను ఉపయో గించుకొని యుద్ధాన్ని సృష్టించి వేలాదిమంది పాలస్తీయన్ల మరణానికి కారణమయ్యారని ఆందోళన వ్యక్త ంచేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం దాడులను ఖండించకుండా ఇజ్రాయిల్ ప్రభుత్వానికి అండగా నిలవడం సరైనది కాదన్నారు. ఇంత దుర్మార్గంగా పాలస్తీనా ప్రజలను ఊచకోతకోస్తున్న ఇజ్రాయిల్‌కు అండగా ఉన్న మోడీ ప్రభుత్వం నిర్ణయాలను వెనక్కి తీసుకొని ఐక్యరాజ్యసమితి చెప్పిన సూచనలు పాటిస్తూ శాంతిని నెలకొల్పాలని, ఈ దాడులను ఖండించా లని అన్నారు. భారతదేశ ప్రజానీకమంతా పార్టీలక తీతంగా పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని వారిని అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పల్లి ధనరాజు, ఆకుల శ్రీనివాసరావు, పి.వసంత, కొటికి పెంట మాజీ సర్పంచ్ అంబురాజు పాల్గొన్నారు.