పల్నాడు జిల్లా: ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సమస్యలు త్వరితగతిన తీర్చడంలో భాగంగా వైద్య సేవలు అందించేందుకు ఈ.హెచ్.యస్ ఓ.పి.డి. ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నట్ల్లు కలెక్టర్ శివ శంకర్ లోతేటి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక లింగంగుంట్ల ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విభాగాన్ని వారు కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతన పల్నాడు జిల్లాలో 55 నెట్వర్క్ ఆసు పత్రులు ఉన్నాయని ప్రైవేటు,గుంటూరు జి.జి.హెచ్ ఆసు పత్రిలతో కలిపి సుమారు 110 సెంటర్ లలో ఈ.హెచ్. యస్ వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రోజుకు ఒక ప్రత్యేక విభాగ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దీర్ఘ కాలిక వ్యాదులు సుమారు 25 వాటికి నిపుణులైన వైద్య బృందంతో వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. 38వ జాతీయ నేత్రదాన పక్షోత్స వాల సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి వారి పేర్లను నమో దు చేసుకొని కళ్ళు లేని వారికి కళ్ళు అందించాలన్నారు. నూతనంగా ఏరియా అస్సుపత్రికి న్యూట్రిషన్ రీహాబిలి టేషన్ సెంటర్ అనుమతి లభించినట్లు చెప్పారు. కార్య కమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మంత్రు నాయక్, డి.సి.హెచ్. యస్. డాక్టర్ రంగారావు, ఆరోగ్య శ్రీ కో-ఆర్డినేటర్ డాక్టర్ సునీలా తదితరులు పాల్గొన్నారు.










