ప్రజాశక్తి-ఉక్కునగరం : ఇఎస్‌ఐలో మెరుగౖెెన వైద్యసేవలు అందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు లేబర్ యూనియన్, సిఐటియు గౌరవాధ్యక్షులు ఒఎల్. రావు ఉక్కు యాజమాన్యాన్ని., రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యూనియన్ ఆధ్వర్యంలో ఉక్కు బిసి.గేటు వద్ద శనివారం ఉదయం నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇఎస్‌ఐలోవైద్యం నానాటికీ దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో రిఫరల్ ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వకుండా, నాణ్యమైన,సరైన మందులు సమకూర్చకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు.ఇదే పరిస్థితి కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు. జి శ్రీనివాసరావు, నమ్మి రమణ, నాయకులు చట్టి నర్సింగరావు, యు సోమేష్, వి వరహాలు, పి మసేను, ఎ శ్రీను, బి ఆనంద్, బండి అప్పలరాజు, నమ్మి చంద్రరావు, విఆర్‌ఎల్ స్వామి పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్మికులు ఆందోళన చేపట్టారు.










