
ప్రజాశక్తి అచ్యుతాపురం
అచ్చుతాపురంలో ఈఎస్‌ఐ 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రాము డిమాండ్ చేశారు. అచ్యుతాపురంలో బుధవారం ఆయన ఈఎస్‌ఐ హాస్పిటల్ గురించి మాట్లాడారు. అచ్చుతాపురం సెజ్, ఫార్మా, ఎన్‌ఏఓబి, పరవాడ ఫార్మాలో వేలాది మంది కార్మికులు, యజమాన్యాల నుండి ఈఎస్‌ఐ పేరుతో సంవత్సరానికి సుమారు రూ.50 కోట్లు ఈఎస్‌ఐ కార్పొరేషన్ వసూలు చేస్తుందని తెలిపారు. అయినా ఈఎస్‌ఐ నుండి వైద్య సేవలు అందడం లేదన్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ఎన్నో ఏళ్ల నుండి పోరాడుతున్న నేటికీ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకోలేదన్నారు. స్థలం, డబ్బులు కేటాయించామని ప్రమాదాలు జరిగినప్పుడు చెబుతూ తర్వాత వదిలేస్తున్నారని విమర్శించారు. వెంటనే ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టి కార్మిక ప్రాణాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న సత్తిబాబు, రుతల గోవిందా, ముత్యాకర్ల రమణ తదితరులు పాల్గొన్నారు