Jan 09,2023 14:29

ప్రజాశక్తి-తడ : తడ మండలం కారూరు పంచాయతీలో ఇదేం కర్మ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాజీ పార్లమెంటు సభ్యులు సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి నెలవల సుబ్రహ్మణ్యం. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పర్వీన్ తాజ్,  రాష్ట్ర కార్యదర్శి మాజీ జెడ్పిటిసి సభ్యులు బొమ్మన శ్రీధర్, క్లస్టర్ ఇంచార్జ్ పూడి సెల్వం, ప్రధాన కార్యదర్శి ఆర్ నీలకంఠం, పార్లమెంట్ తెలుగు బిసి అధికార ప్రతినిధి జీవ, పలని, తెలుగు యువత అధ్యక్షుడు టీకే రవి, బోర్లింగాలపాడు రమేష్ , పర్వత్ రెడ్డి కోటిరెడ్డి, రామ్మూర్తి, రోశెట్టి శివాజీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.