Apr 14,2023 00:02

ఆటోపై కూలిన చింత చెట్టు

చెట్లు విరిగిపడి ఇళ్లు, ఆటో, అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం
ప్రజాశక్తి-కొయ్యూరు

మండలంలో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటలకు ఉరుములు మెరుపులతో వర్షం పడటంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఈదురుగాలుల బీభత్సం కారణంగా రాజేంద్రపాలెం గ్రామంలో చింత చెట్టు విరిగి ఆ గ్రామానికి చెందిన ఉగ్గిన రవి ఆటోపై పడింది. దీంతదా ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఇదే గ్రామంలో మరో చింత విరిగి అంబేద్కర్‌ విగ్రహంపై పడటంతో ఆ విగ్రహం కూలిపోయింది. మండలంలోని సింగవరం గ్రామంలో కొబ్బరి విరిగి రెండు రేకుల ఇళ్లపై పడడంతో ఆ ఇళ్లుధ్వంసమయ్యాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.