మరమ్మతులు చేస్తున్న విద్యుత్ సిబ్బంది
తెనాలి: ఈదురు గాలులకు విద్యుత్ శాఖకు దాదాపు పది లక్షల మేర నష్టం వాటిల్లిందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి ఆదివారం అన్నారు. శనివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 40 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయ అన్నారు. వెంటనే శాఖపరంగా స్పందించి 20 మంది విద్యుత్ సిబ్బంది, వారికి అదనంగా మరో 20 మంది కాంట్రాక్ట్ సిబ్బందితో 24 గంటలలో విద్యుత్ మర మ్మతులు పూర్తి చేశామని చెప్పారు. ఇంకా ఎక్కడైనా మరమ్మతులు ఉన్న ట్లయితే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే విని యోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ శాఖకు సహ కరించాల్సిందిగా ఆయన కోరారు.










