May 22,2023 20:14

చెట్టు కూలి రహదారికి అడ్డంగా పడి ఉన్న దృశ్యం

ఈదురు గాలులకు కూలిన చెట్టు, విద్యుత్ స్తంభం
ప్రజాశక్తి - పగిడ్యాల

      భారీ ఈదులుగాలు రావడంతో తుమ్మచెట్టు, విద్యుత్ స్తంభం  కూలిపోయాయి. సోమవారం సాయంత్రం భారీ ఈదుగాలులు వ్యాపించడంతో పగిడ్యాల నుంచి  నందికొట్కూరు వెళ్లే ప్రధాన రహదారి పగిడ్యాల పెట్రోల్ బంకు, రాయపు గంగాధర్ రెడ్డి పొలం  సమీపాన భారీ తుమ్మ చెట్టు కూలి రహదారికి అడ్డంగా పడి, విద్యుత్ తీగలపై పడడంతో ఒక విద్యుత్ స్తంభం నేలకొరిగి0ది. దీంతో రహదారి వెంబడి రాకపోకలు స్తంభించిపోయాయి. తక్షణమే స్పందించిన పగిడ్యాల సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న జెసిబి సహాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. విద్యుత్ స్తంభం కూలడంతో విద్యుత్తు అంతరాయం ఏర్పడకుండా విద్యుత్ శాఖ ఏఈ క్రాంతికుమార్ స్పందించి తన సిబ్బందితో మరమ్మత్తు చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఈదురుగాలులకు లక్ష్మాపురం గ్రామ సమీపాన విద్యుత్ స్తంభాలు కూలి విద్యుత్తు తీవ్ర అంతరాయం ఏర్పడి గ్రామం చీకటిమయం అయింది. విద్యుత్తు శాఖ అధికారులు ముమ్మరంగా మరమ్మత్తు చర్యలు చేపట్టారు.

 

చెట్టు కూలి రహదారికి అడ్డంగా పడి ఉన్న దృశ్యం
చెట్టు కూలి రహదారికి అడ్డంగా పడి ఉన్న దృశ్యం