Jul 02,2023 23:46

నేల కొరిగిన విద్యుత్‌ స్తంభం

ప్రజాశక్తి-చీడికాడ:విపరీతమైన ఈదురుగాలుల తో కురిసిన వర్షానికి విద్యుత్‌ స్తంభాలు పెద్ద పెద్ద చెట్లు నేల కొరిగాయి. మండలం కేంద్రంలో ఆదివారం సుమారు నాలుగు గంటల సమయంలో విపరీతమైన ఈదురు గాలులతో కురిసిన వర్షానికి విద్యుత్‌ స్తంభాలతో పాటు పెద్ద పెద్ద చెట్లు నేల కొరిగాయి. ఆదివారం కురిసిన వర్షంతో రైతులకు వరి విత్తనాలు వేసుకునేందుకు అదును బాగుంటుందని రైతులు తెలిపారు.ఈ వర్షానికి విపరీతమైన ఈదురుగాళ్లు తోడవడంతో గ్రామంలో స్తంభాలతో పాటు టేకు, చింత, మామిడి, జీడి చెట్లు కూడా నేలకొరిగాయి.
చీడికాడ:వర్షం నీరు బయటికి పోవడానికి దారి లేక స్థానికులు పలు ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంలో రాజావీధి వెనుక గుల్లిపెల్లిలో ఇళ్ల మధ్య వర్షం చేరింది. ఈ నీరు బయటికి వెళ్లడానికి దారి లేక పక్క వీధిలో డ్రైనేజీ, చెత్త, వ్యర్ధాలతో కాలువలో అడ్డంగా కూరుకు పోయింది. ఈ నీరు పోవడానికి దారి లేక మురుగునీరు ఇళ్ల మధ్య నిలిచి ఉండటంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు గుల్లేపల్లి కుటుంబీకులు నేతి ప్రసాదు, గుల్లిపెల్లి గోవిందులు తెలిపారు. రానున్న వర్షాకాలంలో నిత్యం వర్షాలతో మలేరియా, డెంగీ జ్వరాల బారిన పడే అవకాశం ఉందని గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు
పిడుగుపాటుకు యువకులకు గాయాలు
కొత్తకోట:రావికమతం మండలం చీమలపాడు శివారు గిరిజన గ్రామం తాటిపర్తిలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులతో కూడిన వర్షంలో పిడుగు పడి పలువురు గిరిజన యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం తాటిపర్తి గ్రామ సమీపంలో పలువురు యువకులు వాలీబాల్‌ ఆడుతుండగా ఒక్కసారిగా గాలితో కూడిన వర్షం రావడంతో సమీపంలో గల చింత చెట్టు కిందకు పలువురు యువకులు చేరారు. అదే సమయంలో ఆ చెట్టు పైన పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో చెట్టు కింద ఉన్న యువకులందరూ స్పహ కోల్పోయారు. ప్రాణా పాయ స్థితి నుంచి స్వల్ప గాయలతో బయట పడ్డారు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది సహకారంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గ్రామా నికి చెందిన సీదిరి శ్రీను, కుండ్ర బాలరాజు, .సోముల శ్రీను, ) .పాడి చిన్నబ్బాయి, లోత కళ్యాణం, పాడి బాల కృష్ణ, సుర్ల గణేష్‌ తదితరులకు స్వల్ప గాయా లయ్యాయి. వీరిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.