Nov 19,2023 22:54

వైద్య సేవలు అందిస్తున్న  సానల ధీరజ్‌ బాబు, డాక్టర్‌ విజరు


ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : ఒంగోలు శ్రీరామ్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ దత్తత గ్రామమైన ఈదుమూడిలో 'మనం - మన ఊరు - మన ఈదుమూడి' సేవా సంస్థ వ్యవస్థాపకులు కావూరి వాసు సహకారంతో ఉచిత మల్టీ స్పెషాలిటీ మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా సుమారు 250 మందికి వైద్యసేవలందించారు. బీపీ, షుగర్‌, ఈసీజీ గుండె పరీక్ష, నరాల పరీక్షలు చేసి అందరికీ ఉచితంగా మందులు అందజేశారు. మళ్లీ తదుపరి ఉచిత వైద్య శిబిరం డిసెంబర్‌ మూడో ఆదివారం నిర్వహిస్తామని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కావూరి వాసు, శ్రీరామ్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ వైద్యులు జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ సానల ధీరజ్‌ బాబు, జనరల్‌ అండ్‌ లేపరోస్కోపిక్‌ సర్జన్‌ డాక్టరు సున్నపు విజరు కుమార్‌, దంత వైద్య నిపుణురాలు డాక్టర్‌ నందలూరు సరయు, ఫీజియోథెరఫీ డాక్టర్‌ పొక్కినగారి ఏడుకొండలు, డాక్టర్‌ దుష్యంత్‌, హాస్పిటల్‌ మేనేజర్‌ సుధాకర్‌, రవి, నాగరాజు పాల్గొన్నారు.