Dec 06,2022 22:38

      కొయ్యలగూడెం:ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని నమోదు చేసుకోవాలని పోలవరం నియోజకవర్గం టిడిపి కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం కొయ్యలగూడెంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. టిడిపి ప్రజల తరుపున చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగాం 91-9261292612 నంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇచ్చేలా వారికి పూర్తి సమాచారం అందించాలన్నారు.
భీమడోలు:టిడిపి ఆదేశాల మేరకు నిర్ణీత నమూనా పత్రాలతో ఇంటింటికీ తిరిగి 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టిడిపి ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం భీమడోలులో ప్రారంభించారు. తెలుగుదేశం శ్రేణులతో కలిసి ఇంటింటా పర్యటించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే సందర్భంగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి సభ్యులు కరణం పెద్దిరాజు, ఎఎంసి మాజీ ఛైర్మన్‌ పుల్లయ్య నాయుడు, టిడిపి ప్రముఖులు మురళీకృష్ణ పాల్గొన్నారు.