Jan 04,2022 22:32

award estunna sp koushal

ఇద్దరు పోలీసులకు వీక్లీ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అవార్డులు
ప్రజాశక్తి-కలక్టరేట్‌
ముదినేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగతనం కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన గుడివాడ సిసిఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ కె.శ్రీనివాసరావుకు, నాగాయలంక పరిధిలో జరిగిన దోపిడీ కేసును ఛేదించి పూర్తి సొమ్మును రికవరీ చేసినందుకు కోడూరు పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ పి.ఆంజనేయులుకు జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ మంగళవారం వారాంతపు ప్రతిభ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వత్తిలో నైపుణ్యం ప్రదర్శిస్తే ఏ స్థాయి సిబ్బంది కైనా ప్రశంసలు అందజేస్తామన్నారు. ఇదే స్ఫూర్తిని మునుమందు కొనసాగించాలన్నారు. తేనీరు అందించి అభినందనలు తెలిపారు.నిరంతరం జరుగుతున్న వివిధ రకాల నేరాలకు ఛేదనకు జిల్లా పోలీస్‌ శాఖ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడి కొంతమంది నేరప్రవత్తి ఎంచుకుని నేరాలకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై పూర్తి నిఘా ఉంచాలన్నారు. వారం రోజుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హెడ్‌ కానిస్టేబుల్‌ కు, కానిస్టేబుల్‌ కు ఈవారం వీక్లీ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అందజేసి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.