తూడి లో ఓటర్ సర్వే పై ఆరా తీస్తున్న ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి
వీరఘట్టం: మండలంలోని హుస్సేన్ పురం, తూడి, రేగులపాడు , పనస నందివాడ, బీటివాడ గ్రామాల్లో గురువారం ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి పర్యటించారు. తూడి, హుస్సేన్ పురం గ్రామాల్లో ఓటర్ సర్వేలో లోపాలు ఉన్నాయని గుర్తించి ఇద్దరు బిఎల్‌ఒలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని తహశీల్దారు సిహెచ్ సత్యనారాయణకు ఆదేశించారు. బిటివాడ గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. రేగులపాడు పనస నందివాడ గ్రామాల్లో జగనన్న కాలనీలను పరిశీలించారు.










