Oct 14,2023 18:03

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ

ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు అరెస్టు
రూ. 10,77,500 లక్షలు, 3  కేజీల గంజాయి మూడు ప్యాకెట్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం
జిల్లా ఎస్పీ కె .రఘువీర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

     నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలీసు స్టేషనులో ఇటీవల నమోదు కాబడిన ఆర్ ర్టీసీ బస్సు లో జరిగిన దొంగతనంకు పాల్పడిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి నుండి రూ.10,77,500 లక్షలు  నగదు,3  కేజీల గంజాయి మూడు ప్యాకెట్లు,2 సెల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కె. రఘు వీర్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అరెస్టు కాబడిన ముద్దాయిలు మహమ్మద్ ఇక్రమ్@హాఫిజ్ మహమ్మద్ ఇక్రమ్, వసీం లను మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన గొల్ల సంజన్న తన గ్రామం నుండి మూడు లారీలు ఉల్లిగడ్డల లోడు తన సొంత లారీ ఒక్కటి రెండు లారీలు ఉల్లిగడ్డలు ఇతర రైతుల నుండి కొనుగోలు చేసి వాటిని పచ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం మార్కెట్ నందు అమ్ముకున్నాడని ఆలా ఉల్లిగడ్డలు అమ్మగా వచ్చిన నగదు 11 లక్షలు రూపాయలను బ్యాగ్ లో పెట్టుకొని ఈ నెల 7 వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో విజయవాడ నుండి అనంతపురం కు వెళ్లు ఇంద్ర బస్సు ఎక్కి కర్నూలు కు వస్తుండగా అదే బస్సు లో ఇద్దరు గుర్తు లేలియని వ్యక్తులు గుంటూరు బస్టాండ్ లో ఎక్కి పక్క వరుస సీట్ నందు కూర్చొని ప్రయాణిస్తూ పిర్యాదుదారుడు గొల్ల సంజన్న నిద్రపోవు సమయంలో 11 లక్షల రూపాయలను దొంగలించుకొని దోర్నాల నుండి దిగిపోయారని అనుమానంతో పిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.ఆత్మకూరు సీఐ దర్యాప్తు ప్రారంభించి, నిందుతుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా నిందుతులు ఆత్మకూరు పట్టణము శివార్లలో ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు వారినిఆత్మకూరు పోలీసులు అదుపులోకి తీసుకోని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. వారి వద్ద ఉన్న రూ. 10,77,500 లక్షలు  నగదు, 3  కేజీల గంజాయి మూడు ప్యాకెట్లును 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.కేవలం వారం రోజుల్లో ఈ కేసులోని ఇద్దరు నిందితులను అరెస్టు చేయడము జరిగిందని పేర్కొన్నారు.నిందితులు వారి ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక, త్రాగుడు, గంజాయి సేవించడం అలవాట్ల వల్ల బస్సు ప్రయాణంలో బ్యాగుల నుండి డబ్బులను దొంగలించడం నేర్చుకున్నారని, నిందుతులు వారి మిత్రులు మోట సలీం, మోట అస్లాము, ఇస్లాం అహ్మదు, హసీనా అహ్మదు, మోహను, అక్లాత అహ్మద్, విక్రమ్ తదితరులతో కలిసి మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బస్సు ప్రయాణాలలో ప్యాసింజర్ లకి చెందిన లగేజీ బ్యాగుల నుండి, డబ్బులను దొంగలించడం వంటి కార్యక్రమాలను 2009 సంవత్సరం నుండి ప్రారంభించినట్లు విచారణ లో వెళ్లడైనట్లు ఎస్పీ తెలిపారు.
సదరు దొంగతనాల నుండి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ  జల్సాలకు అలవాటు పడ్డారన్నారు.2009 సం.లో తెలంగాణలోని మెదక్ జిల్లా, రామాయంపేట ప్రాంతంలో బస్సులో ప్యాసింజర్ బ్యాగుల నుండి 2,69,000/-  రూపాయలను దొంగలించి అక్కడ పోలీసులకి దొరికి, అరెస్టు అయి జైలుకు వెళ్ళి, మూడు నెలలు జైలులో ఉండి కేసును ఒప్పుకొని, జైలు శిక్ష అనుభవించి జైలు నుండి విడుదలైయ్యారని,నిందితులు దొంగతనాలను బస్సులో ఎక్కిన ప్యాసింజర్లు తమ లగేజీని, బస్సు లగేజ్ ర్యాకులో ఉంచి, పదే పదే ఆ లగేజ్ ను గమనిస్తూ ఉండినట్లయితే వారి బ్యాగులను వారు నిద్రలోనికి జారుకున్న తర్వాత నిందితులు లగేజి బ్యాగ్ లో ఉన్న డబ్బులను దొంగతనం చేసి, తరువాత వచ్చే స్టేజి వద్ద దిగి వెళ్లిపోయేవారని, నిందుతులు దొంగతనము చేసిన తరువత ఒరిస్సా రాష్ట్రం సరిహద్దులలో గంజాయిని కొని తమ సొంత ప్రాంతానికి తీసుకొని పోయి ఎక్కువ డబ్బులకు అమ్ముకొంటున్నారని ఎస్పీ తెలిపారు.విలేకరుల సమావేశంలో ఆత్మకూరు డి‌ఎస్‌పి ఎ .శ్రీనివాసరావు,  ఆత్మకూరు సీఐ ఎం .నాగభూషణ్, నంద్యాల సీసీఎస్ సి ఐ లు రామకృష్ణ, సాదిక్ అలీ, ఆత్మకూరు ఎస్ ఐ లు జి .కృష్ణమూర్తి, డి .వెంకట నారాయణ రెడ్డి, వెలుగోడు ఎస్ ఐ యూ .వెంకట ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుల్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకి ఎస్పీ పలు సూచనలు చేశారు.  
జిల్లాలోని అన్నీ బస్టాప్ ల వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. బస్సు ప్రయాణంలో నగదును వెంట తీసుకెళ్ళేటప్పుడు ఇంకొకరిని తమ వెంట తోడుగా తీసుకెళ్లాలి. మరియు నిర్లక్షంగా (నిద్రించడం) వ్యవహరించకుండా అప్రమత్తంగా ఉండాలి.  ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులు ఇచ్చిన తినుబండారాలు, ప్రసాదాలు తీసుకోనరాదు.  ఎవరైనా ప్రయాణికులు ఒక ప్రదేశానికి టికెట్టు తీసుకుని, మరొక ప్రదేశంలో బస్సు దిగిపోయేటప్పుడు డ్రైవర్/కండక్టర్ మిగతా ప్రయాణికులను అలర్ట్ చేయాలి.