ఇద్దరికి డాక్టరేట్
ప్రజాశక్తి - క్యాంపస్ :శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బయో సైన్స్ అండ్ సెరీకల్చల్ విభాగం పరిశోధకు రాలు ఎస్. షర్మిలకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల విభాగం సీఈ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెరికల్చర్ విభాగం ప్రొఫెసర్ డి.ఎం.మమత పర్యవేక్షణలో 'సూక్ష్మజీవుల గట్ ఫ్లోరా విశ్లేషణ బాంబిక్స్ మోరీ కొన్ని జాతులు, దాని ఉత్పత్తికి సిల్క్, ఫెకండిటీ' అంశంపై పరిశోధన గ్రంథాన్ని వర్సిటీకి సమర్పించినట్లు వెల్లడించారు. షర్మిల పలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా జర్నల్స్ లలో అనేక పరిశోధన పత్రాలను ప్రచురించినట్లు వివరించారు. షర్మిలకు డాక్టరేట్ అవార్డు రావడం పట్ల పలువురు ఆచార్యులు, పరిశోధకులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ఈఈఈ పరిశోధక విద్యార్థి ఏ సురేష్ కుమార్ కు డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్లు సిఇ మూడే దామ్లానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈఈఈ విభాగం ఆచార్యులు డాక్టర్ వి.ఉషారెడ్డి పర్యవేక్షణలో '' పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ టు ఇంప్రూవ్ ఎఫ్ఫీసియేన్సీ ఆఫ్ పీవీ సిస్టమ్ ఇన్ వారియస్ కన్ఫిగురేషన్స్'' అనే అంశంపై పరిశోధనా గ్రంధాన్ని వర్సిటీకి సమర్పించినట్లు వెల్లడించారు. సురేష్ కుమార్ పలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా జర్నల్స్ లలో అనేక పరిశోధన పత్రాలను ప్రచురించినట్లు వివరించారు. ఏ.సురేష్ కుమార్ కు డాక్టరేట్ అవార్డు రావడం పట్ల పలువురు ఆచార్యులు, పరిశోధకులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.










