ప్రజాశక్తి-పెడబయలు : మండల కేంద్రంలో అల్లూరి జిల్లా సమగ్ర శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శనివారం ఉదయం. ఆకస్మికంగా సమీపంలో గల అంగణవాడి కేంద్రాలను పర్యవేక్షించారు. ముందుగా తమరాడ, పెడబయలు కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం. స్థానిక జి.టి డబ్ల్యూ బాలికల ఉన్నత పాటశాల సీతగుంట బాలికల వసతి గృహంలో 9,10, తరగతులు చదువుతున్న విద్యార్థినులతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రోజెక్ట్ డైరెక్టర్ ఎన్ సూర్య లక్ష్మీ మాట్లాడుతూ. బాల్య వివాహాలు నిలువరించలని చదివే విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చదువుతో పాటు ఆటపాటల నందు చురుకుగా పాల్గొనాలని అన్నారు. బడిలో చదివే విద్యార్థినిలు తప్పుదు మార్గంలో వెళ్లి జీవితాలను దుర్భరం చేసుకోవద్దని చదివే బలబికలకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పలాలు అందిస్తుందన్నారు. ఇతరుల ప్రలోబాలకు లోంగకుడదని. చిన్నప్పుడే వివాహాలు చేసుకొని జీవితాలు పాడుచేసుకోవద్దని ప్రతి ఆడపిల్ల ఆరోగ్యంగా ఉండాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలేని 21ఏళ్లు నిండే వరకు వివాహాలు చేసుకోరాదని బ్రతుకుపై అవగాహన కలిగి ఉండాలనీ చిన్నప్పుడే పెళ్లిలు జరిగితే పుట్టే పిల్లలు బరువు తక్కువగా ఉండి పిల్లలు చనిపోయే ప్రమాదముందని అన్నారు. ఆడపిల్లలు ఒంటరి ప్రయాణం చేసిటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తల్లిదండ్రులు సహకారంతో ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధపడలేని ఆటోల్లో ప్రయాణించేటప్పుడు. డ్రైవర్లు మోసగించే అవకాశం ఉందనీ వాటి నివారణా కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం పగడ్బందిగా అమలు చేస్తోందన్నారు. వివాహ వయసు కలిగిన ఆడపిల్లలకు వివాహమై పిల్లలు పుడితే ప్రభుత్వం ప్రోత్సాహంతో సహకరిస్తుందని వయసు నిండకుండా వివాహమైతే అనారోగ్య వంతమైన పిల్లలు పుట్టే అవకాశం ఉందని తెలిపారు. చిన్న పిల్లలకి తల్లిపాలు మాత్రమే పెట్టాలని అన్నారు. అంగనవాడి కేంద్రాల్లో పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందిసున్నమని అలాగే విద్యార్థినిలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిచాలన్నారు. బయటి వ్యక్తులతో పరిచయాలు సంబంధాలు ఉండరాదని సూచించారు. ఈకార్యక్రమంలో స్టనిక సిడీపీ ఓ ఎన్ రాజ్యలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు










