Nov 04,2023 22:30

ఈచర్‌ ట్రావెల్స్‌, బస్సు ఢకొీ

ఈచర్‌ ట్రావెల్స్‌, బస్సు ఢకొీ
10 మంది వలస
కూలీలకు తీవ్ర గాయాలు
పజాశక్తి- వి.కోట
మండల పరిధిలోని కొమ్మరమడుగు మలుపులో ఈచర్‌, ట్రావెల్స్‌ బస్సు ఢకొీన్న సంఘటనలో పదిమంది వలస కూలీలు తీవ్రంగా గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు... ఉపాధి కోసం ఒరిస్సా నుంచి కేరళకు వెళుతున్న కూలీల బస్సు ప్రమాదవశాత్తు కొమ్మరమడుగు సమీపంలో ఎదురుగా వస్తున్న ఈచర్‌ వాహనం ఢకొీన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వీకోట ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కొరకు కుప్పం పిఇఎస్‌ కు తరలించారు.
ఈ ప్రమాదంలో రెండు వాహనాలకు చెందిన ముందు భాగాలు ఇరుక్కు పోయాయి. ఇరుక్కుపోయిన రెండు వాహనాలను జె సి బి యంత్రం సాయంతో గ్రామస్తులు, అధికారులు తొలగించారు. మానవత్వంతో సహాయక చర్యల్లో గ్రామస్తులు అధికారులకు సహకరించారు. వర్షం కురుస్తుండటంతో ప్రమాదకరమలుపులో వేగంగా రెండు వాహనాలు ఢకొీన్నాయి. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే వెంకటే గౌడ సంఘటనా స్థలం వద్ద దిగి ప్రమాద విషయాలను అడిగి తెలుసుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న కూలీలకు మెరుగైన వైద్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. విెకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.