May 31,2023 19:28

గుమ్మనూరు సోదరులను సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - హోళగుంద
ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో జగన్మోహన్‌ రెడ్డికి ఎవరూ సాటికారని వైసిపి ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జీ గుమ్మనూరు నారాయణస్వామి, దేవరగట్టు ఆలయ కమిటీ ఛైర్మన్‌ గుమ్మనూరు శ్రీనివాసులు తెలిపారు. బుధవారం స్థానిక వైసిపి నాయకులు తోక వెంకటేష్‌ ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి హామీలను నెరవేరుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నాడు-నేడు కింద ప్రతి పాఠశాలనూ అభివృద్ధి చేస్తున్నారని, విద్యార్థులు బడి మానేయకుండా 'అమ్మ ఒడి' పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు మరోసారి జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారని తెలిపారు. ఆలూరు, హోలగుంద మండల కన్వీనర్లు వీరేశ్‌, షఫీవుల్లా, వైసిపి నాయకులు వందవాగిలి మల్లికార్జున, ఈసా, శేషప్ప, ఎల్లార్తి దర్గన్న పాల్గొన్నారు.