
ప్రజాశక్తి - చిలమత్తూరు : ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేని పేదలకు కలెక్టర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని వ్యకాసం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి స్థలాలు ఇవ్వాలని 43రోజులు గా పేదలు ఆందోళన చేస్తుంటే అదికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అన్నారు. గత వారం రోజులు క్రితం కలెక్టర్ ఇచ్చిన హామి అమలు చేస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. చిలమత్తూరు మండలం కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 805 సర్వే నెంబరులో గల భూమిలో గుడిసెలు వేసుకున్న ప్రదేశంలోనే పట్టాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, లక్ష్మి నారాయణ, రామచంద్ర ఇంటి స్థలాల సాధన కమిటీ నాయకులు సదాశివ రెడ్డి, చందు, రహమత్తుల్లా, రియాజ్, శివ, నాగరాజు, చందు, శివ, మణి, చరణ్, మంజు తదితరులు పాల్గొన్నారు.