ప్రజాశక్తి-గుంటూరు : విద్యుత్ ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలిగించే విధంగా ఉన్న పిఆర్‌సి ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ జిల్లా నాయకులు సిహెచ్.నాగబ్రహ్మాచారి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా వరుసగా రెండో గురువారం స్థానిక కొత్తపేటలోని డి-3 విద్యుత్ కార్యాలయం వద్ద స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాగబ్రహ్మాచారి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఉద్యోగులు, కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ యాజమాన్యం, పవర్ జెసితో కుదుర్చుకున్న ఒప్పందం ఇంజినీర్లకు, ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్, పీస్‌రేట్ కార్మికులకు నష్టదాయకమన్నారు. జెఎల్‌ఎం గ్రేడ్-2లకు ఈ వేతన ఒప్పంద అసలు వర్తింప చేయట్లేదన్నారు. ఎవరికీ ఉపయోగం లేని ఈ వేతన ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2014 వరకూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒకే పిఆర్‌సిని పొందిన విద్యుత్ ఉద్యోగులు ఆ తర్వాత జరిగిన రెండు పిఆర్‌సిలలో ఏపీలోని ఉద్యోగులు, కార్మికులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. తెలంగాణ కంటే 30శాతం తక్కువ వేతనాలతో ఏపీ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు బి.లక్ష్మణరావు, జిల్లా కార్యదర్శి జి.నాగరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో సంబంధం లేకుండా ఏ విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. 2022 పిఆర్‌సి అమలు చేయమంటే 2018 పిఆర్‌సికి రెండు శాతం కలిపి అమలు చేస్తామనే ఒప్పందం అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల్ని నిలువునా ముంచట మేనన్నారు. పాదయాత్ర సందర్భంగా సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీ కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేసుకొని రూ.43వేల వేతనం ఇస్తుంటే ఇక్కడ మాత్రం రూ.27వేలు ఇస్తున్నారన్నారు. కొత్తగా చేరిన వారికి రూ.13 వేలే ఇస్తున్నారన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరి ంచాలని, తిరోగమన వేతన ఒప్పందం రద్దు చేసే వరకూ ఉద్యమిస్తామన్నారు. కార్యక్ర మంలో సిఐటియు గుంటూరు నగర తూర్పు కమిటీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ నాయకులు జి.పవన్, కె.రాంబాబు, నాగేశ్వ రరావు, రాజు, వేణు, సుధాకర్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - పెదకాకాని : స్థానిక పెదకాకాని విద్యుత్ కార్యా లయం వద్ద స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టగా నాగబ్రహ్మాచారి మాట్లా డారు. బాల భాస్కర్, సత్యనారాయణ, బల్ల య్య, జానీ, అనిల్, ఇర్మియ పాల్గొన్నారు.










