Oct 27,2023 23:06

మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి


ప్రజాశక్తి-తర్లుపాడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అందిస్తున్న ఈ సబ్సిడీ రుణాలను మహిళా సంఘ సభ్యులు ఉపయోగించుకొని ఆర్థిక అభివద్ధిని సాధించాలని మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తెలిపారు. మండలంలోని చెన్నారెడ్డిపల్లి గ్రామ సచివాలయంలో రెండు గ్రామాలకు సంబంధించి జీవనోపాదుల కల్పన పీఎంఈజీపి, పీఎంఎఫ్‌ఎంఈ జగనన్న బడుగు వికాసం, రుణాల ద్వారా మహిళా సంఘ సభ్యులు ఆర్థిక అభివద్ధికి సుస్థిరమైన జీవనోపాధిని ఏర్పాటుకు శుక్రవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, రామసుబ్బారెడ్డి, గ్రామ సర్పంచి మురారి సుబ్బమ్మ, ఎంపీటీసీ వెంకటయ్య, సొసైటీ అధ్యక్షులు కుందూరు సత్యనారాయణరెడ్డి, ఎంపిడిఓ ఎస్‌.నరసింహులు, ఎపిఎం డి.పిచ్చయ్య, ఎల్‌సి సిసి కె.నాగభూషణం, సిసిపి సాయిలు, గ్రామ సంఘ అధ్యక్షురాలు కుందూరు గహలక్ష్మి, విఓఎలు, మహిళా సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.