Nov 10,2023 00:50
కొండపి కుమ్మరిపాలెంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే స్వామి

ప్రజాశక్తి-కొండపి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలు చేసింది ఏమీ లేదని, ఇంక ఈ రాష్ట్రానికి జగన్‌ అవసరం లేదని కొండపి శాసనసభ్యులు డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. గురువారం కొండపిలోని కుమ్మరిపాలెం గ్రామంలో బాబు ష్యూరిటీి-భవిష్యత్తు గార్యంటీ కరప్రతాలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. అధికార ప్రభుత్వ వైపల్యాలను వివరిస్తూ బాబు అధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలను గురించి గ్రామస్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోవాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. స్థానిక సమస్యలు అధికార పార్టీ వారు గాలి కొదిలేశారని తెలిపారు. ఈ ప్రాంతంలో రోడ్లు, కాల్వలు, వీదిలైట్లు కూడా లేకపోవడంతో ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. జాళ్లపాలెం రోడ్డులో సైడు కాల్వులు లేక రోడ్డు మీద మురుగునీరు ఉండడంతో అక్కడ బ్రతికే వారు చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ఇప్పటికే ప్రజల్లో మార్పు మొదలైందని రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలుపు తథ్యమన్నారు. వైసిపికి ప్రజలు బుద్ధి చేప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఏపి అభివృద్ధి చెందాలంటే అది ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు జి రామయ్యచౌదరి, మండల పార్టీ అధ్యక్షులు బి యలమందనాయుడు, రాష్ట్ర నాయకులు వసంతరావు, రావిపాటి సీతమ్మ, మాజీ ఎంపిపి దేపూరి రత్తమ్మ, మండల మహిళా నాయకులు బి ప్రసన్న లక్ష్మి, నన్నూరి సుబ్బరామయ్య, బి సోమయ్య, షేక్‌ కాలేషా, కందిమళ్ల రమేష్‌, దేపూరి సుబ్బారావు, కాశయ్య, ఎల్లావుల వెంకటేశ్వర్లు, ముక్కు ప్రసాదు, కూనంనేని శంకర్‌, నేతి రవికుమార్‌, బి అనిల్‌కుమార్‌, మునగల జాన్‌, గడ్డం మదు, గుది రమణయ్య, దేవరాల బ్రహ్మయ్య, పట్టణంలో మహిళా నాయకులు, కుమ్మరిపాలెం టిడిపి నాయకులు, మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.