Nov 01,2021 09:11

దీపావళి అనగానే గుర్తొచ్చేది దీపాలు, దివిటీలు. అయితే ప్రకృతిలో అనేక వస్తువులను, ఆకారాలను పోలిన పూలు, పండ్లు చూడముచ్చటగా చూపరులను ఆకర్షిస్తుంటాయి. ప్రస్తుతం దీపావళి నేపథ్యంలో దీపాలు, దివిటీలు, టపాసులను పోలిన పూలు, పండ్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..!

                                                          ప్రమిద దీప్తి పువ్వు

ఈ పూలు.. 'దీపాల' దివిటీలు..

ప్రమిదలో ఒత్తిలా వెలుగులు చిమ్ముతూ ఉండే పువ్వు గ్లోరియోసా సుపెర్బ్‌. దీన్ని క్లయింబింగ్‌ లిల్లీ అని కూడా పిలుస్తారు. గిరిజనులు దీపపువ్వు అని అంటారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆయుర్వేద వైద్యంలో ఈ మొక్కకి ఎంతో ప్రాధాన్యత ఉంది.

                                                          చిచ్చుబుడ్డి పూలమొక్క

ఈ పూలు.. 'దీపాల' దివిటీలు..

అచ్చంగా నక్షత్రాలాంటి చిచ్చుబుడ్డి కాంతులు వెదజల్లే పూలమొక్క క్లీరోడెండ్రం పనికులాటం. దీన్ని పగోడా ఫ్లవర్‌ అని కూడా అంటారు. పెద్ద పెద్ద ఆకులతో మొక్క 10 అడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. పువ్వుల్లో తేనె ఉండటం వల్ల నిత్యం దీని చుట్టూ కీటకాలు తిరుగుతుంటాయి.

                                                         మతాబా పూలు

ఈ పూలు.. 'దీపాల' దివిటీలు..

తెల్లటి పాల వెలుగులు విరాజిమ్మే పూలు హైబ్రిడ్‌ జామ పూలు. ఔషధాలు గనైన జామ పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి. ముఖ్యంగా చీకటి వేళల్లో మతాబాల్లా మెరుస్తుంటాయి.
 

                                                            కాకర కాంతులు

ఈ పూలు.. 'దీపాల' దివిటీలు..

ఎరుపు, తెలుపు రంగుల సమ్మిళిత కాంతులు చిందించే కాకర పువ్వొత్తుల్లాంటి వెలుగుల పరిమళాన్ని ఇచ్చే పౌడర్‌ పఫ్‌ పూలు. కలియాండ్రా జాతికి చెందిన ఈ మొక్కలు అరుణ కాంతులు విరజిమ్ముతాయి.

                                                            అగ్గిపుల్ల పూలు

ఈ పూలు.. 'దీపాల' దివిటీలు..

దీపావళి రోజు పిల్లందరూ కాల్చే అగ్గిపుల్లల ఆకారంలో కనిపించే పూలు ఆచమేయా గమోసేపలా విత్తమ్‌. శాస్త్రీయ నామంతో పిలిచే ఈ మొక్కలు పొడవుగా ఉండే గెలకు చుట్టూతా అగ్గిపుల్లలు వంటి ఆకార రేఖలు అందాన్ని ఇస్తాయి. దీన్ని మాస్టిక్‌ బ్రోమలైడ్‌ అనికూడా పిలుస్తారు. వర్షాకాలం చివరన, శీతాకాలం పొడవునా ఈ పువ్వులు పూస్తాయి.

                                                          డాలియా మెరుపులు

ఈ పూలు.. 'దీపాల' దివిటీలు..

రంగులు, కాంతులు కురుస్తున్నట్లు ఉండే వెలుగుల పువ్వు డాలియా. దుంప జాతికి చెందిన ఈమొక్క నుంచి సన్నని దూట వచ్చి వర్ణ కాంతులను, పరిమళాలను విరజిమ్ముతుంది.
 

                                                              ఫిరంగి పువ్వు

ఈ పూలు.. 'దీపాల' దివిటీలు..

ఫిరంగి కాల్చినప్పుడు మంట వచ్చినట్లు కనిపించే పువ్వు లికోస్పెరమం కార్డిప్లోరియం. ఇది దీపావళి సీజన్‌లోనే పూస్తుంది. మిరుమిట్లు గొలిపే కాంతులు వేదజల్లుతుంది.

                                                               జువ్వ మెరుపులు

ఈ పూలు.. 'దీపాల' దివిటీలు..

తారా జువ్వలు ఆకాశంలోకి దూసుకుపోయినట్లు కనిపించే పూల మొక్క కళ్లింద్రా బెవిప్స్‌ బెంద్ర. చీకట్లో దీని పూలు జువ్వ కాంతులు కురిపిస్తుంది.

                                                             వెన్నముద్ద పువ్వు

ఈ పూలు.. 'దీపాల' దివిటీలు..

చిన్ని చిన్ని పూలతో కాంతి చినుకులు చిమ్మే వెన్నముద్దను పోలి ఉంటుంది అల్లియం నిగ్రం. లేత నీలం, లేత గులాబీ, లేత తెలుపు రంగుల కలబోతలో చిన్ని నక్షత్రాల్లాంటి పూలు పూస్తాయి.

                                                  ఉల్లిపాయ బాంబులు -ఎర్రజామలు

ఈ పూలు.. 'దీపాల' దివిటీలు..

పీసీడియం గోవాకి చెందిన సరికొత్త హైబ్రిడ్‌ జామ ఎర్ర జామ. తియ్యగా మధురంగా ఉండే ఈ జామ నాటిన మూడో ఏట కాపుకొస్తుంది. ముదురు ఎరుపు రంగులో నిగనిగలాడే మెరుపులతో చూడ్డానికి అచ్చంగా ఉల్లిపాయ బాంబుల్లానే ఉంటాయి. కుండీల్లోనూ, నేలమీదా పెంచుకోగలిగే ఈ మొక్క దీపావళినాటికి ఫలసిరినిస్తుంది.