Oct 27,2023 21:12

కొత్తవలస: మాట్లాడుతున్న జెడి రామారావు

ప్రజాశక్తి - కొత్తవలస
రైతులు తప్పని సరిగా ఈ పంట నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావు తెలిపారు. మండలంలో రెల్లి గ్రామ సభలో ఆయన శుక్రవారం పాల్గొని మాట్లాడారు. ఈ పంటలో నమోదు చేసిన ప్రతి రైతు పేరును గ్రామ సభ నిర్వహించి చదివి వినిపించాలని సిబ్బందికి సూచించారు. ఈ పంట నమోదు ప్రక్రియలో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినట్లుతే, రైతులు గమనించి స్థానిక వ్యవసాయ లేదా ఉద్యాన సహాయకులకు తెలియజేయలని సూచించారు. అలా మీరు తెలియచేసినట్టు అయితే స్పందనలో మరలా సరి చేసే అవకాశం ఈ నెల 29 వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోని వ్యవసాయ శాఖ నుంచి వచ్చే వివిధ ప్రయోజనాలను రైతులు పొందాలన్నారు. జిల్లాలో ప్రతి మండలంలో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో సామాజిక తనిఖీ కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రామ సభలు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. గ్రామ సభల్లో రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు ఎల్‌ విజయ, వ్యవసాయ అధికారిణి మాధురి శరణ్య, విఎఎ ప్రసన్న, రైతులు పాల్గొన్నారు.
డెంకాడ: మండలంలోని పినతాడివాడలో ఈ పంట నమోదుపై వ్యవసాయాధికారి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవ సాయాధికారి విటి రామారావు మాట్లాడుతూ ఈపంట నమోదులో పొరపాట్లు ఉంటే ఈ నెల 29లోగా రైతులు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సహయ వ్యవసాయ సంచాలకులు వి. హరికృష్ణరాజు, వ్యవసాయ విస్తరణాధికారి టి. రామకోటి, విఎఎలు కిరణ్మయి,పాల్గొన్నారు.
శృంగవరపుకోట: ఇ-పంట నమోదు వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని మండల వ్యవసాయ అధికారి కె రవీంద్ర తెలిపారు. మండలంలోని సంత గౌరమ్మపేట రైతు భరోసా కేంద్రంలో ఈ పంట ముసాయిదా జాబితాను, సామాజిక తనిఖీ నిమిత్తం గ్రామసభను ఆయన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వ్యవసాయ సహాయకులు ఎల్‌. రవిచంద్ర కుమార్‌ రైతుల యొక్క పేర్లు పంట నమోదు వివరాలను చదివి వినిపించి ఆ జాబితా రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉంచారు. ఈ పంట సామాజిక తనిఖీల్లో భాగంగా గ్రీవెన్స్‌ మాడ్యూల్‌ను అందుబాటులో ఉంచడం వల్ల ఏమైనా మార్పులు ఉంటే రెండు రోజులు అవకాశం ఉందని గ్రామసభకు హాజరైన పెద్దలకు రైతులకు తెలియజేశారు.