
ఆటలంటే నాకిష్టం
బొమ్మలంటే నాకిష్టం
ఆటల కన్నా బొమ్మల కన్నా
అఆలు అంటే మరీ నాకిష్టం
అల్లరంటే నాకిష్టం
చిల్లర డబ్బులంటే నాకిష్టం
అల్లర చిల్లరకన్నా
అమ్మా నాన్నంటే మరీ నాకిష్టం
చినుకంటే నాకిష్టం
కునుకంటే నాకిష్టం
చినుకు కునుకు కన్నా
తోడబుట్టినోళ్లంటే మరీ నాకిష్టం
అక్షరాలంటే నాకిష్టం
బడంటే నాకిష్టం
అక్షరాలు బడి కన్నా
విద్య నేర్పే గురువంటే మరీ నాకిష్టం
- గాదిరాజు రంగరాజు