Oct 26,2023 21:30

పాచిపెంట.. ఇ-క్రాప్‌ జాబితాను పరిశీలిస్తున్న ఎఒ తిరుపతిరావు

ప్రజాశక్తి-పాచిపెంట : ఇ-క్రాప్‌లో తప్పుల సవరణకు చివరి అవకాశం ఇస్తున్నట్లు ఎఒ కె.తిరుపతిరావు తెలిపారు. మండలంలోని మోసూరు, పాంచాలి, గురివినాయుడుపేట, మాతుమూరు రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించిన ఇ-క్రాప్‌లో నమోదైన రైతుల జాబితాను గురువారం ఆయన పరిశీలించారు. ఇ-క్రాప్‌ నమోదులో ఏవైనా చిన్న చిన్న తప్పులు దొర్లితే సరి చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని తెలిపారు. రైతుల వివరాలను గ్రామసభలలో చదివి వినిపించడమే కాకుండా రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించాలని సూచించారు. రైతు గ్రూపులలో వాట్సాప్‌ ద్వారా తెలియజేయాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వక ఫిర్యాదులను స్వీకరించి, సవరించాలని తెలిపారు. నవంబర్‌ ఒకటో తేదిన సవరణలు పూర్తయ్యాక తుది జాబితా రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విఎఎలు బాలకృష్ణ, శ్రీను, గణేష్‌, దినేష్‌ పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని కె.వెంకటాపురం, జోగింపేట గ్రామాలలో గురువారం ఇ-పంట నమోదు జాబితా ప్రదర్శనను ఎఒ అవినాష్‌ పరిశీలించారు. రైతులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సర్పంచులు బి.శ్రీనివాసరావు, కె.సింహాచలం, వి.ఈశ్వర నారాయణ పాల్గొన్నారు.