Aug 11,2023 18:34

ప్రజాశక్తి - ఆగిరిపల్లి
     పంట వేసిన ప్రతి రైతు ఈ-క్రాప్‌(పంట నమోదు) నందు తమ పంటలను నమోదు చేయించుకొని, తద్వారా ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా అందించే పలు సదుపాయాలను సద్వినియోగపర్చుకోవాలని ఆగిరిపల్లి మండల వ్యవసాయశాఖాధికారి పి.చెన్నారావు కోరారు. వడ్లమాను గ్రామంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ-క్రాప్‌ విధానాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవిన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్యర్యంలో జాయింట్‌ అజమాయిషీ ద్వారా క్షేత్రస్థాయిలో జియో ఫెన్సింగ్‌/జియో కోఆర్డినేట్స్‌ ఆధారిత విధానంలో ఈ-క్రాప్‌(పంట నమోదు)చేయటం జరుగుతుందన్నారు. అనంతరం ఆర్‌బికె సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎఇఒ కె.ధనబాబు, విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌, వెంకటలక్ష్మీ, విలేజ్‌ హార్టీకల్చరల్‌ అసిస్టెంట్‌ అపర్ణ, రైతులు పాల్గొన్నారు.