కురుపాం: మండల పరిధిలోని మేజర్ పంచాయతీ కురుపాంలో నిర్వహిస్తున్న పంట నమోదు కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల సాగు చేసిన రైతుల వివరాలను తప్పవని ఇ- క్రాప్ నమోదు చేయించుకోవాలన్నారు. ఇ- క్రాప్ నమోదు చేయించుకున్న రైతులకు ప్రభుత్వం అందించే రాయితీలు వర్తిస్తాయని తెలిపారు. పంట ఉత్పత్తులను అమ్ముకోవాలన్నా ఇ- క్రాప్ నమోదు తప్పనిసరి అని తెలిపారు. పిఎం కిసాన్ పథకానికి అర్హులైన ప్రతి రైతుకు ఇకెవైసి చేయించు కోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సహాయకులు నిర్మల జ్యోతి, తహశీల్దార్ ఆర్.రమేష్ కుమార్, వ్యవసాయ, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
వీరఘట్టం: ఇకెవైసి చేయించుకున్న రైతు నుండే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, ఆ విధంగా ప్రతి రైతు తప్పనిసరిగా ఇకెవైసి నమోదు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు రైతులకు సూచించారు. మండలంలోని దశమంతపురం, చలివేంద్ర గ్రామాల్లో పర్యటించారు. ఇ-క్రాప్ బుకింగ్‌తో ఇకెవైస్ నమోదు కూడా వేగవంతం చేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. మండలంలో ఇంతవరకు ఇ-క్రాప్ బుకింగ్ క్రాప్ ఎంత శాతం నమోదైంది, ఇకెవైసి ఎంత శాతం నమోదయిందని స్థానిక ఎఒ జె.సౌజన్యను ప్రశ్నించగా మండలంలో ఇ-క్రాప్ బుకింగ్ 90శాతం, ఇకెవైసి 80శాతం నమోదైనట్లు వివరణ ఇచ్చారు. జెసి వెంట విఆర్‌ఒలు జి.రాజేంద్రప్రసాద్, సురేష్ కుమార్, రైతులు పాల్గొన్నారు.










