ప్రజాశక్తి - ముసునూరు
ఇ-క్రాప్‌లో ప్రతి రైతు పంట నమోదు చేయించుకోవాలని రమణక్కపేట సర్పంచి రంగు ధనలక్ష్మి గాంధీ అన్నారు. మండలంలోని రమణక్కపేట గ్రామ సచివాలయంలో మండల వ్యవసాయాధికారి కె.చినసూరిబాబు ఆధ్వర్యంలో పంట నమోదు వివరాలను గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల వద్ద ఉంచినట్లు తెలిపారు. పంట వివరాలు తప్పుగా నమోదు చేయించుకుంటే మళ్లీ సరిచేసి నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు, రైతులు ఉన్నారు.










