ప్రజాశక్తి - హాలహర్వి
ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన ప్రతి పంటనూ తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలని ఎడిఎ సునీత తెలిపారు. సోమవారం హాలహర్వి గ్రామంలోని రైతు రామకృష్ణ పొలంలో పంట నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పంటలను జియో ట్యాగ్ ద్వారా ఈ-క్రాప్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. పంటల నమోదు చేయకపోతే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, రైతు భరోసా, ఇన్స్యూరెన్స్ వర్తించవని చెప్పారు. ఈ-క్రాప్ బుకింగ్‌కు ప్రతి రైతూ సహకరించాలన్నారు. అనంతరం రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఖరీఫ్‌లు పంటల సాగు చేసిన ప్రతి రైతూ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసు పుస్తకం, సర్వే నెంబర్లు తదితర వివరాలు ఈ-క్రాప్ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పంటల బీమా వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు పొందాలంటే తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలని సూచించారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇంద్రజ, తలారి ఆంజనేయులు పాల్గొన్నారు.
ఎరువులను పంపిణీ చేస్తున్న ఎడిఎ సునీత, ఎఒ శివశంకర్










